1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115
|
వైయుడిట్ యూనికోడ్ ఎడిటొర్ తరచుగా అడిగే ప్రశ్నలు
========================
వర్శన్: ౨.౮.౧
రచయత: గాశ్పర్ సినాయి <gaspar@yudit.org>
స్తలము మరియు తేది: టోక్యో ౨౦౦౩-౦౬-౨౫
తెలుగు అనువాదకుడు: కృష్ణ దాస కవి రాజు <krsnadasakaviraju@yahoo.com>
స్తలము మరియు తేది: హైదరాబాదు ౨౦౦౪-౦౬-౦౨
ప్రశ్న ౧: ఈ తరచుగా అడిగే ప్రస్నలు మరళ నేను ఎలా ప్రదర్శించగలను?
జవాబు ౧: 'help' అని కమాండ్ ప్రదేశములో టైపు చెయ్యగలరు. (బహుశ ఇది మీకు ఇంగ్లీషు లో ఈ తరచూ అడిగే ప్రశ్నలు ప్రదర్శించవచ్చు-అనువాదకుడు). అలాగే మీరు 'test' ని కమాండ్ ప్రదేశము లో టైపు చేసి పరిక్ష కాగితము పొందవచ్చు. ఇంకా 'howto japanese', 'howto configure' అని టైపు చేసి ఎల చేయడము అను కాగితములు పొందవచ్చు.
ప్రశ్న ౨: తరువాతి వర్శన్లకు ఎలా మెరుగు పరచగలను?
జవాబు౨: http://www.yudit.org/ నుండి మీరు దిగుమతి చేసుకొనండి.
ప్రశ్న౩: నేను దాచిపెట్టు (సేవ్) మీఠ నొక్కినాను, కాని ఏమీ జరగలేదు. ఎందుకని?
జవాబు౩: వైయుడిట్ కి కమాండు లిను కలదు, మీరు ఎంటరు మీఠ నొక్కవలెను అనుకుంట.
ప్రశ్న౪: సాదారణముగా "Unix" ("యునిక్ష్") అని చూపిస్తూ కుడివైపు గల ఆ [లైను విరామము] ఏమిటి?
జవాబు౪: లైను విరామ గుర్తులు:
యునిక్ష్= '\n' - యునిక్ష్ లైను విరామము
డాస్= '\r\n' - డాస్ లైను విరామము
మాక్='\r'-మాక్ లైను విరామము
యెల్ యెస్ = యూ + ౨౦౨౮ - యూనీకోడ్ లైను విరామము
పి యస్ = యూ + ౨౦౨౯ - యూనీకోడ్ పరాగ్రాఫు విరామము
వైయుడిట్ నన్ందు మీరు వీటిని కలపవచ్చు- ఉదాహరణకు మీరు డాస్ మరియు యునిక్ష్ రెండు రకాల లైను విరామములు గల ఫైలు సృష్టించవచ్చు, కాని ఇలా కలపడము సాద్యమైనంతవరకు చేయవద్దు
ప్రశ్న౫: వివిధ సంకేతీకరణల వివరములు పొందడము ఎలా? (-e ఎంపిక)
జవాబు౫:మీ లైనక్షు పెట్టలో 'man uniconv' లేదా 'uniconv -h' అని ఏదో ఒక షెల్ లో టైపు చెయ్యండి.
ప్రశ్న౬: నెను నా స్వంత కీబోర్డ్ లోపలి సమాచార ఫైలు ఎలా కలప గలను?
జవాబు౬: మీ ఫైలు /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/data లో ఉండవచ్చు,
in this case you just need to add this to
ఇటువంటి స్థితిలో ఆ సమాచరాన్ని /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/config/yudit.properties కు కలపగలరు. అలా కాకున్న, మీరు sourcd kmap ఫైలు ని ద్విపద నిర్మాణము లోనికి మార్చవలెను. దీని కోసము ఈ క్రింది కమాండు ఉపయోగించండి
mytool -type kmap -kmap My.kmap -rkmap My.kmap -write My.my
ఆ తరువాత కాపీ చెయ్యండి cp My.my ~/.yudit/data
Note that kmap files can be used as text converters and font maps too.
దయచేసి ఆ kmap souce ఫైలు ని నాకు పంపించగలరు, తరువాతి పంపకములో నేను కలుపుతాను. ఈ kmap ఫైలు గురించిన మరింత సమాచారము కొరకు /usr/share/yudit/doc/keymap-format.txt ని చూడగలరు. వైయుడిట్ తో పాటు వచ్చే kmap ఫైల్ల మూల కోడ్ కొరకు /usr/share/yudit/src/ ని చూడగలరు.
గమనిక: kmap ఫైల్లు వచన మార్పిడిగా మరియు పదరూపము మ్యాపు చెయ్యడానికి కూడా ఉపయోగపడతాయి
ప్రశ్న౭: నా స్వంత భాష లో సమాచారము ఎలా చూడగలను?
జవాబు౭: మూల కోడ్ ని దిగుమతి చేసుకోని దానిలోని README.TXT (రీడ్ మీ . టెక్ష్ట్ ) ని చదవండి. అది మీకు ఎలా చెయ్యాలో చెపుతుంది. దయచేసి నాకు అనువాదములు పంపించండి, వాటిని భవిష్యత్తు వర్షన్ పంపకములలో ఉంచగలను.
ప్రశ్న౮: నేను ఒక ట్రూ టైపు పదరూపము ఎలా కలపగలను?
జవాబు౮: font-file.ttf మరియు ఇతర టి టి యఫ్ ఫైలులను
/usr/share/yudit/fonts or ~/.yudit/fonts
నందు ఉంచగలరు ఆ తరువాత ఒక కొత్త కాల్పనిక పదరూపము కలుపుతూ
/usr/share/yudit/config/yudit.properties
ని మార్చగలరు. ఉదాహరణకు
yudit.font.MyFont=font-file.ttf,some-other-fontfile.ttf,..
yudit.editor.fonts=...,MyFont,... అని కలిపిన లేదా yudit.fonts=....,MyFont,...అని కలిపిన మీరు ఈ పదరూపము ని ఉపయోగించగలరు
ప్రశ్న౯: విండోస్ వర్సన్ ఎక్కడ వుంది?
జవాబు౯: వైయుడిట్ సిటు నందే మీకు విండోస్ వర్సన్ లింకు (కలయిక ) వుంటుంది, కాని అది కొత్త వర్సన్ కాక పోవచ్చు. (ఈ జవాబు ఇంగ్లీషు FAQ కి బిన్నమైనది - అనువాదకుడు)
ప్రశ్న౧౦: వైయుడిట్ ఎంత మంచి యూనికోడ్ ఎడిటరు?
జవాబు౧౦: ఎక్కడైతే బాగుంది అనిపించినదో అక్కడ నేను యూనికోడ్ ప్రమాణము అమలు చేసినాను, కాని అక్కడక్కడ కొన్ని తేడాలు వునాయి. దయచేసి ఇరువైపులనుండి (కుడినుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి -ఉర్దూ లాగా)వ్రాయు విషయముల కొరకు /usr/share/yudit/doc/HOWTO-bidi.txt ని చదవగలరు.
ప్రశ్న౧౧: నేను కమాండు గీత లో ౩ ఫైల్లు నిర్దేశించినాను కాని నాకు ఒకటే ఫైలు కనిపిస్తున్నది. ఎందుకు?
జవాబు౧౧: అవి చరిత్ర లో తాత్కాలికముగా ఉనాయి. మీకు కావలెనన్న కమాండు లోకిని వెల్లి, పై బాణము(Ctrl -k , కంట్రోలు కె) మరియు క్రింది బాణము(ctrl j కంట్రోలు జె) ఉపయోగించవచ్చు.
ప్రశ్న౧౨: హాట్ కీ బైండింఘులు (hot-key bindings ) ఏమిటి?
జవాబు౧౨: You can see most of them - the yellow tooltip shows them
underlined. Most of them should work with Ctrl as well as Alt keys.
The pluggable editor currently has the following keybindings:
Escape - కమాండు విధము మరియు ఎడిటర్ విధము మధ్య మారడానికి ఉపయోగ పడుతుంది.
Home - లైను మొదటికి వెళ్ళడానికి
End - లైను చివరకు వెళ్ళడానికి
b - కాగితము పైకి
f - కాగితము క్రిందకి
k - పైకి
n,j - క్రిందకి
h - ఎడమకు
l - కుడివైపునకు
m - లైను మొత్తము తొలగించండి
x - ఎన్నుకొనబడినది తొలగించండి
v - చివరగ ఎన్నుకొనబడినది అతికించండి
If Meta is kept down while moving the caret, the text will be selected.
Mouse double click selects a word triple click selects a full line.
ప్రశ్న౧౩: నేను ద్విపద కీమ్యాపు (binary kmap) ఫైలు ని ఎలా చదవగలను?
జవాబు౧౩: మీరు ఈ క్రింది విధముగా మూల కోడు ని చూడగలరు.
mytool -my /usr/share/yudit/data/GreekBible.my \
-convert mys -write GreekBible.mys
ప్రశ్న౧౪: నేను ఒక యూనికోడ్ అక్షరాన్ని ఎలా త్వరగా ప్రవేశపెట్టగలను?
జవాబు౧౪: లోపలకి ప్రవేశపెట్టు పద్దతిని (ఇన్ పుట్, input) యూనికోడ్ [unicode] కి మార్చి, uxxxx లేదా Uxxxxxxxx గాని ప్రవేశపెట్టండి, x అనునది ఇక్కడ షష్ట్యాంశ మానము లోని అంకె
ప్రశ్న౧౫: వైయుడిట్ ఎలా వెతుకుట మరియు మార్చుట ప్రమేయములు చేయగలదు?
జవాబు౧౫: కమాండు గీత లోన replace పాత_వచనము కొత్త_వచనము అని టైపు చేసి ప్రతి మార్పునకు ఎంటరు కీ నొక్కండి.
ప్రశ్న౧౬: నేను చేతి వ్రాత పద్దతి ఎలా ఉపయోగించగలను?
జవాబు౧౬: నీలి రంగు బాణపు (లోపలికి పంపించు పద్దతి input method)పై నొక్కి ఒక కీ ని freehand (ఫ్రీ హ్యాండు ) కి జత చెయ్యగలరు.
ప్రశ్న౧౭: నేను వాక్యవిన్యాస (syntax) ప్రతేకముగా చూపడాన్ని ఎలా ఆపగలను?
జవాబు౧౭: కమాండు ప్రదేశము నుండి 'syntax none' అని టైపు చెయ్యడము ద్వారా మీరు ఆపుచెయ్యగలరు. అలాగే మీరు 'syntax' అని టైపు చేసిన తిరిగి పొందవచ్చు. దీనిని కాన్ఫిగ్ ఫైలు లో కూడా చెయ్యవచ్చు.
ప్రశ్న౧౮: నేను పదాలు స్వయముగా లైనులు గా మరడము ఎలా ఆపు చెయ్యగలను?
జవాబు౧౮: కమాండు ప్రదేశము లోన 'wordwrap false' అని టైపు చేయ్యడము ద్వారా ఆపు చెయ్యగలరు. అలాగే 'wordwrap true' అని టైపు చెయ్యడము ద్వారా మరళ మొదలు పెట్టగలరు.
ప్రశ్న౧౯: ఈ తెలుగు అనువాదము లో తప్పులు ఉన్న ఏమి చెయ్యాలి?
జవాబు౧౯: పైన తెలపబడిన అనువాదకుడి కి ఈ ఉత్తరము వ్రాయగలరు. దయచేసి ఈ పదము బాగా లేదు అని వ్రాయకండి, మరొక పదము సూచించండి.
అనుబంధము
========
౧.౧. కీ మ్యాపు ఉదాహరణలు:
ఈ క్రిందవి కొన్ని Telugu-Rts (తెలుగు ఆర్ టి యస్ ) ఉదాహరణలు
amma అమ్మ
aavu ఆవు
illu ఇల్లు
Iga ఈగ
telugu తెలుగు
AMdhrapradESu ఆంధ్రప్రదేశు
|